Sunday, December 22, 2024

ఇల్లు కూలి ఆరుగురు కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

ఊటీ : తమిళనాడులోని ఊటీలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోగా ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. వారంతా మహిళలే అని పోలీసులు తెలియజేశారు. ఆ ప్రాంతంలో రక్షణ, సహాయ కార్యక్రమాలు ప్రస్తుతం సాగుతున్నాయి. లవ్‌డేల్ సమీపంలో సంభవించిన ఈ ఘటనలో మరి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని, ఒక వ్యక్తి జాడ తెలియరావడం లేదని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News