Sunday, February 2, 2025

ఇటుక బట్టీ గోడ కూలి ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

రూర్కీ : ఉత్తరాఖండ్ లోని లహబోలి గ్రామంలో మంగళవారం ఇటుకబట్టీ గోడ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. అయితే ఇంకా గోడ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బట్టీలో ఇటుకలు నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీస్‌లు రంగం లోకి దిగి జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించే పని చేపట్టారు. వైద్య సహాయక బృందం కూడా ప్రమాదస్థలానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News