- Advertisement -
జల్‌పాయ్‌గురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ లోని జల్‌పాయ్‌గురి జిల్లా జల్‌పాయ్‌గురి సాదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యూమోనియా, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం తదితర కారణాల వల్ల ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో 88 మంది తీవ్రమైన జ్వరం, డయేరియాతో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి 42 మంది పిల్లలను డిశ్చార్జి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు చికున్‌గున్యా, డెంగీ, జపనీస్ ఎన్‌సిఫలిటిస్ వంటి ఏ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారో తెలుసుకోడానికి వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారు. పిల్లలందరికీ కొవిడ్ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ భౌమిక్ చెప్పారు.
- Advertisement -