Saturday, December 28, 2024

ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఆరేళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

సింగపూర్: భారత సంతతికి చెందిన ఆరేళ్ల సింగపూర్ బాలుడు మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. నేపాల్‌లోని బేస్‌క్యాంప్‌ను చేరుకున్న ఓం మదన్ గార్గ్ సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. అక్టోబర్‌లో పదిరోజులపాటు తల్లిదండ్రులతో కలిసి నేపాల్‌లోని సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తులో ఉన్న సౌత్ బేస్ క్యాంప్‌కు ప్రయాణించాడు. ఓమ్ తండ్రి గార్గ్ (38), తల్లి మహేంద్రం సెప్టెంబర్ 28 ఓ గైడ్, ఇద్దరు పోర్టర్లు సాయంతో తమ ప్రస్థానం ప్రారంభించారని స్ట్రెయిట్ టైమ్స్ వార్తాపత్రిక సోమవారం తెలిపింది.

కుటుంబం తమ మొత్తం ప్రయాణాన్ని యుట్యూబ్ ట్రావెల్ చానల్‌లో ప్రసారం చేసింది. సీనియర్ బిజినెస్ ఎనలిస్ట్ అయిన మయూర్ గార్గ్ ఔత్సాహిక పర్వతారోహకుడిగా గుర్తింపు పొందారు. ఇండోనేసియా, రష్యా, టాంజానీయాలో పర్వతాలను అధిరోహించిన గార్గ్ నవంబర్ 2021న ఎవరెస్ట్‌ను అధిరోహించారు. కాగా కిండర్ గార్డెన్ విద్యార్థి అయిన ఓం మదన్ గార్గ్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం మొత్తం తను చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News