Wednesday, January 22, 2025

ఆరేళ్ల బాలికపై గొర్రెల కాపరి అత్యాచారం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొల్లాపూర్ పట్టణానికి చెందిన ఆరేళ్ల మైనర్ బాలికపై గొర్రెల కాపరి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరుగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కొల్లాపూర్ పట్టణంలోని ఒక కాలనీకి చెందిన బాలిక రెండవ తరగతి చదువుతోంది. సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ బాలికను పరిసర ప్రాంతంలో గొర్రెలు మేపుతున్న కాపరి గమనించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డిఎస్‌పి శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడిని గద్వాల జిల్లా, మానపాడు మండలానికి చెందిన నర్సింహ (45)గా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News