Saturday, December 21, 2024

పోక్సో కేసులో మరణశిక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/సంగారెడ్డి: చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, హ త్యచేసిన నిందితునికి మరణించే వ రకు ఉరి తీయాలని స్పెషల్ పోక్సో జడ్జి సంచలన తీర్పునిచ్చారు. జి ల్లా ఎస్‌పి రూపేష్ గురువారం ఈ వివరాలను తెలిపారు. బిడిఎల్ భా నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని చై తన్య కంపెనీలో శంకర్, అతని భా ర్య ఉమాదేవి అనే కూలీలు అదితి నిర్మాణ సంస్థ లేబర్ మేస్త్రీగా ఉన్న చింతకింది శ్రీనివాస్‌రావు అనే వ్య క్తి ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్ పదో తే దీన వీరిని కంపెనీలో పనికి పం పగా, వారు తమ ఐదేళ్ల మనుమరాలిని సెక్యూరీటి గార్డు వద్ద ఉంచి వెళ్లారు. సమీపంలోని లేబర్ రూం లో ఉండే బీహార్‌కు చెందిన గఫార్ (56) అనే వ్యక్తి ఆ రోజు పనికి వెళ్లకుండా మద్యం సేవించి తిరుగుతున్నాడు. ఇంతలో అతనికి చిన్నారి పాప కనిపించగా, ఆమెను తనకు తెలిసిన పాపగా చెప్పి, కూల్ డ్రింక్ తాగించి తీసుకొస్తానని చెప్పి సమీపంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లా డు. అనంతరం పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయ మం ఎవరికైనా చెబుతుందన్న ఉద్దేశంతో పాపను చంపేశాడు.

అక్కడే పాప మృతదేహాన్ని పడేసి, ఏమీ తెలియనట్లుగా కంపెనీ వద్దకు వచ్చాడు. దీంతో తమ మనుమరాలు అదృశ్యంపై పాప కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌హెచ్‌ఓ రవీందర్‌రెడ్డి ఎస్‌సి, ఎస్‌టి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన డిఎస్‌పి పురుషోత్తమ్‌రెడ్డి ఛార్జిషీట్ దాఖలు చేయగా, కేసు పూర్వాపరాలు విన్న స్పెషల్ పోక్సో జడ్జి జయంతి సంచలన తీర్పు నిచ్చారు. నిందితుడు గఫార్‌ను చనిపోయేంత వరకు ఉరి తీయాలని పేర్కొన్నారు. బాధితురాలి రక్త సంబంధీకులకు 10 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు.ఈ కేసుపై జిల్లా ఎస్‌పి రూపేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి, హైకోర్డుకు వెళ్లి స్పీడ్ ట్రయల్‌కు అనుమతి తీసుకుని, కేవలం 11 నెలల్లో నిందితునికి ఉరిశిక్ష పడేలా చేశారు. ఈ కేసులో నిందితునికి కఠిన శిక్ష పడేందుకు కృషి చేసిన అదనపు ఎస్‌పి సంజీవరావు, అశోక్,అప్పటి ఎస్‌హెచ్‌ఓ రవీందర్‌రెడ్డి, సిఐ పురుషోత్తంరెడ్డి, పిపిలు అనంతరావు కులకర్ణి,కృష్ణ తదితరులును ఎస్‌పి అభినందించారు. 27 సంవత్సరాల తర్వాత జిల్లాలో ఒక నిందితునికి మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News