న్యూఢిల్లీ:కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) డెరెక్టర్‌గా ఐపిఎస్ అధికా సుబోధ్ కుమార్ జైశ్వాల్ నియమితులయ్యారు. ప్రధానమంత్ర నరేంద్ర మోడీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నే అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ మంగళవారం ఆయన నియమకానికి పచ్చ జెండా ఊపింది. జైశ్వాల్ 1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ అధికారి. ప్రస్తుతం సిఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారంనాడు రాత్రి కేబినేట్ నియామకాల కమిటీ సుబోధ్ అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ డెరెక్టర్ పదవి గత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఖాళీగా ఉంది. అంతకు ముందు రిషీకుమార్ శుక్లా సిబిఐ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి అడిషినల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా సిబిఐ తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 90నిమిషాల సుదీర్ఘ సమావేశం తర్వాత జైశ్వాల్ నియామకానికి అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఎంపిక విధానాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ వ్యతిరేకించినట్లు సమాచారం. జైశ్వాల్ రెండేళ్ల పాటు సిబిఐ డెరెక్టర్‌గా పదవిలో ఉండనున్నారు.
SK Jaiswal appointed as New CBI Director