Monday, December 23, 2024

టిటిడికి విరాళంగా 70 లక్షల ఆస్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల శ్రీవారికి ఓ మహిళా భక్తురాలు 70 లక్షలు విలువ చేసే ఇంటిని విరాళంగా ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన భక్తురాలు ఎస్‌కె నెమావతి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తిరుమల శ్రీనివాసుడికి సుమారు రూ.70 లక్షల ఆస్థిని విరాళంగా అందజేశారు.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, పల్లిపట్టు తాలుకా కొడివలస గ్రామానికి చెందిన రిటైర్డ్ నర్సు అయిన నెమావతి కొత్తగా నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ భవనానికి సంబంధించిన పత్రాలను, తాళాలను టిటిడి ఎస్టేట్ అధికారి మల్లికార్జునకు అందజేశారు. అనంతరం భక్తురాలికి ఆలయ వేద పండితులు ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News