Wednesday, January 22, 2025

పరిపూర్ణమైన సినిమా ‘స్కంద’

- Advertisement -
- Advertisement -

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద’ ది ఎటాకర్ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు.

ఉస్తాద్ రామ్ పవర్ హౌస్ ప్రెజెన్స్, హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఒక విస్పోటంలా ఉంది. రామ్ వండర్ ఫుల్ మాస్ ట్రాన్స్ ఫర్మేషన్, ఫెరోషియస్ యాటిట్యూడ్, యాక్షన్ సన్నివేశాలలో డైనమిజం ఎక్స్‌ట్రార్డినరిగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… బోయపాటి చాలా అంకితభావంతో సినిమా చేస్తారు. తమన్ సంగీతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవదాస్ నుంచి రామ్ ప్రయాణం చూస్తున్నాం. అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నాడు. ఎంతో తపన ఉన్న నటుడు, మనం అందరం గర్వించదగ్గ నటుడు, కళామతల్లి మనకి ఇచ్చిన ఒక వరం రామ్ పోతినేని. శ్రీలీల పదహారణాల తెలుగమ్మాయి. అందం, అభినయం, నృతం అన్ని కలగలిపిన ప్రతిభ ఆమె సొంతం. ‘భగవంత్ కేసరి’లో తను నటిస్తున్నారు.

ఇన్ని సినిమాలు చేస్తున్నా తనలో ఎలాంటి అలసట కనిపించదు. ట్రైలర్‌లో చూసినట్లే సినిమా కూడా కన్నులవిందుగా, చెవులకు ఇంపుగా ఉంటుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ… బోయపాటి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక, మూడు తరాలు జై బాలయ్య అంటుందంటే.. ఒక నటుడికి అది పెద్ద అచీవ్ మెంట్. ఇంతకంటే మించిన అవార్డ్ వుండదు. అలాంటి గొప్ప నటుడు బాలకృష్ణ అని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ… అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ ఇది. యాక్షన్, ఎమోషన్ హై లెవల్స్‌లో ఉంటాయి. పరిపూర్ణమైన సినిమా ‘స్కంద’. ఒక పాత్ర ఇస్తే దాన్ని ఎలా చేయాలనే నిరంతర తపన పడే వ్యక్తి రామ్. తను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అతని తపన. ఈ సినిమాలో ఎలా చేశారో ట్రైలర్‌లో చూశారు. రేపు సినిమాలో చూడబోతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస చిట్టూరి, శ్రీలీల, తమన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, స్టన్ శివ, సంతోష్ డికాటే, కాసర్ల శ్యామ్, కళ్యాణ్ చక్రవర్తి, రఘురాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News