Monday, December 23, 2024

విందు భోజనంలాంటి సినిమా

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ మైల్‌స్టోన్ 75 వ చిత్రం ‘సైంధవ్’. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి ఈనెల 13న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక బుధవారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ అందంగా ట్రైలర్ ప్రారంభమైంది. ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌హీరో. ట్రైలర్‌ని బట్టి చూస్తే పాప సినిమాకి సోల్. తన కుమార్తె కోసం శాంతి మార్గంలో నడవాలని ఎంచుకున్న తండ్రి ఆమె కోసం హింసాత్మక మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఇది ఫ్యామిలీస్ తో పాటు యాక్షన్, థ్రిల్లర్ సినిమా ప్రేమికులకు నచ్చేలా చేసింది. సైకోగా వెంకటేష్ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశారు. బేబీ సారాతో అతని బంధం ఒక ప్రధాన ఆకర్షణ. బేబీసారా తన నటనతో ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా తమ పాత్రలతో అలరించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం.

75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను”అని అన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ “ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్‌మేకింగ్ అంతా వాడేశాను. వెంకటేష్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు”అని తెలిపారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ “వెంకటేష్‌తో సినిమా చేయడంతో నా కల నేరవేరినట్లయింది. ఈ సినిమా విందు భోజనంలా వుంటుంది”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో గెటప్ శ్రీను, చైతన్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు తదిత రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News