Monday, December 23, 2024

సెప్టెంబర్ 28న ‘స్కంద’

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం బెస్ట్ డేట్ ని లాక్ చేశారు. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

స్కంద గురువారం విడుదల కానుంది కాబట్టి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వుంటుంది. ఆ తర్వాత సోమవారం (గాంధీ జయంతి) సెలవు. దసరా సెలవులు కూడా కలిసిరాబోతున్నాయి. ఈ రకంగా ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ కి ఇది పర్ఫెక్ట్ డేట్. రిలీజ్ డేట్ పోస్టర్‌ లో రామ్, శ్రీలీల అందమైన చిరునవ్వులు చిందిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా,  శ్రీలీల గాగ్రా చోళీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ విడుదలయ్యాక క్రేజ్‌ మరింత పెరిగింది. స్కంద రామ్ కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కూడా రికార్డ్ సృష్టించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News