Monday, January 20, 2025

మహిళ కడుపులో ఎముకల గూడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తీవ్రమైన కడపునొప్పితో వచ్చిన మహిళకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా శిశువు ఎముకల గూడు కనిపించడంతో ఆపరేషన్ చేసిన వాటిని బయటకు తీసిన సంఘటన విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో జరిగింది. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం….. అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ(27)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం మందులను వేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కడుపు నొప్పితో విలవిలలాడుతుండేవారు. స్థానిక వైద్యుల సూచనల మేరకు ఆమె పెయిన్ కిల్లర్స్ మందులు వాడేవారు. కడుపు నొప్పి ఎక్కువగా వస్తుండడంతో జిజిహెచ్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వైద్యులు స్కాన్ చేయగా కడుపులో గడ్డ ఉందని తేలింది. వెంటనే ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. గత శనివారం వైద్యులు సదరు మహిళకు ఆపరేషన్ చేసి ఎముకల గూడును బయటకు తీశారు. వైద్యపరిభాషలో ‘లితోపెడియన్’ అని పిలుస్తారని వైద్యుడు శివానంద తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటివి 25 కేసులు నమోదుయ్యాయని తెలియజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News