జీసీసీల్లో యువతకు ఉద్యోగ
అవకాశాలు ఐటి, పరిశ్రమల
శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్లోబల్ కేపబిలిటి సెంటర్ల(జీసీసీ)లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవతీసుకుంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. ఈ విషయమై ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జీసీసీలకు అనుకూల వాతావరణ ఉండడం వల్ల నగరం జీసిసిలకు హబ్‌గా మారుతుందన్నా రు. ప్రస్తుతం నగరంలో 355 జిసిసిలలో దాదాపు మూడు లక్షలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రముఖ దిగ్గజ కంపెనీలు కొత్తగా జిసిసిలను హై దరాబాద్‌లో ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి వివరించారు. ప్రధానంగా బ్యాం కింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బిఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో
ఏర్పాటవుతున్న జిసిసిల సంఖ్య పెరుగుతుందన్నారు.
బిఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టియం, ఎక్విప్ సహకారంతో స్కిల్ యూనివర్సిటీ ద్వారా బిఎఫ్‌ఎస్‌ఐ జిసిసిలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులుగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని తె లిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా బిఎఫ్‌ఎస్‌ఐ స్కిల్లింగ్ పేరిట ప్రత్యే ప్రొగ్రాంను ప్రారంభించిన ట్లు వెల్లడించారు. బీటెక్ పట్టభధ్రులకు నాలుగు నె లల పాటు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్టమెంట్ బ్యాంకింగ్, స్టాఫ్‌వేర్, ప్రొగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తామని మంత్రి వివరించారు. ఈ కోర్సుకు కేవలం సర్టిఫికేట్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకుగాను రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈసారి ఈ కోర్సుకు 1,320 మంది బిటెక్ పట్టభద్రులు రిజిస్టర్ చేసుకున్నారని, వీరికి ప్రత్యేకంగా ఆదివారం నాడు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్‌ఇసి) ప్రాంగణంలో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న పట్టభద్రులు స్కిల్ యూనివర్సిటీ వైబ్‌సైట్‌ను సందర్శించాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.
బిసి కమిషన్ అవగాహన కార్యక్రమాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కులగణనకు 16 నుంచి 28 వరకు మరోసారి అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయమై బిసి కమిషన్ ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ఇందుకు కోసం బిసి కమిషన్ చైర్మన్, ఇతర సభ్యులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అవగాహనా కార్యక్రమాలు చేపట్టనుంది.