Friday, November 22, 2024

డిసెంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Skill Development Center to Start in Dec: KTR

మన తెలంగాణ/హైదరాబాద్: దండుమల్కాపురంలోని ఎంఎస్‌ఎంఇగ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్) డిసెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని తెలపడానికి సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పార్కులు నెలకొల్పి, వాటిల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ, వారికి ఉపాధి అవకాశాలు పెంచడమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని కెటిఆర్ ప్రకటించారు. 547 ఎకరాల్లో విస్తరించి, 589 ఎంఎస్‌ఎంఇ యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన దండుమల్కాపురం ఎంఎస్‌ఎంఇగ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి లభిస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.

Skill Development Center to Start in Dec: KTR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News