Wednesday, January 22, 2025

స్కిల్ స్కామ్… ఆ డబ్బు టిడిపి ఖాతాలకు చేరింది: సిఐడి అడిషనల్ ఎజి

- Advertisement -
- Advertisement -

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో దోచేసిన డబ్బును హవాలా మార్గంలో మళ్లించారని సిఐడి అడిషనల్ ఎజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్ బోస్‌కు డబ్బు ఇచ్చామని వారి మధ్య కోడ్ భాష ఉందన్నారు. ఈ స్కామ్‌లో డబ్బులో కొంత మొత్తం టిడిపి ఖాతాలకు చేరిందని, ఆ వివరాలు ఇచ్చేందుకు టిడిపి అంగీకరించడంలేదని సిఐడి అడిషనల్ ఎజి పేర్కొన్నారు. సహనిందితుల ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ కోసం తప్పుడు మెడికల్ రిపోర్టు కోర్టు ముందుంచారని, ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అడిషనల్ ఎజి కోరారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించారని, దర్యాప్తునకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, పిటిషన్ కొట్టేయాలని హైకోర్టుకు నివేదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News