Tuesday, January 21, 2025

ఆ రంగులతో హోలీ ఆడారో.. ఇక అంతే!

- Advertisement -
- Advertisement -

రంగుల పండుగ హోలీ. చిన్నా పెద్దా అంతా కలిసి హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా, సంబరంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ, రంగులు పూసుకుంటూ తుళ్లుతూ, కేరింతలు కొడుతూ పండుగను ఆస్వాదిస్తారు. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగ నాడు పిల్లల సంబరం అంబరాన్ని అంటుతుంది. అయితే హోలీ జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే స్కిన్ ఎలర్జీ రావచ్చు. కళ్లు దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.

  • మార్కెట్లో రసాయనాలతో చేసే రంగులు కొని వాడకూడదు. వాటివల్ల చర్మం పాడవచ్చు. రసాయనాలతో చేసే రంగులు కళ్లలో పడటం ప్రమాదకరం. జుత్తు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. వీటికి బదులు ఆర్గానిక్ రంగులను కొనడం మంచిది.
  • శరీరానికి కొబ్బరి నూనె రాసుకుని హోలీ ఆడటం వల్ల రంగులు ఒంటికి పట్టకుండా ఉంటుంది. దానివల్ల చర్మం దెబ్బ తింటుందన్న బెంగ అక్కర్లేదు. జుత్తుకు కూడా నూనె పట్టించుకుంటే మంచిది.
  • కళ్లలోకి రంగులు పోకుండా కళ్లద్దాలు ధరించాలి. టోపీ పెట్టుకుంటే జుత్తు పాడవకుండా ఉంటుంది.
  • కొన్ని రకాల రంగులు దుస్తులకు అంటుకుని మరకలు పడతాయి. కాబట్టి పాత దుస్తులు వేసుకుని హోలీ ఆడటం మంచిది.
  • ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ రంగులు చల్లుకోవడం మంచిది కాదు. ఏక్సిడెంట్లు అయ్యే అవకాశమే కాకుండా, నీళ్లు ఇంజన్లోకి వెళ్లి బండ్లు పాడవుతాయి కూడా.
  • ఉబ్బసం, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రంగులు చల్లుకోకపోతేనే మేలు. అంతగా పండుగ జరుపుకోవాలనుకుంటే, మాస్క్ ధరించడం ఉత్తమం.

హోలీ ఆడాక, నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయడం వల్ల తలకు అంటుకున్న రంగులు వదిలిపోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News