- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్కొడా ఆటో ఇండియా హైదరాబాద్లోని నాగోల్ వద్ద మోడీ ఇండియా కార్స్లో కొత్త డీలర్షిప్ కేంద్రాన్ని ప్రారంభించింది. కొత్త కేంద్రం ద్వారా హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ లక్షంగా చేసుకుంది. నాగోల్ ఉన్న మోడీ ఇండియా కార్స్ 428 చదరపు మీటర్ల విస్తర్ణం, ప్రదర్శనలో సుమారు 7 కార్ల సామర్థాన్ని కల్గి ఉంటుంది. స్కొడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, స్కొడా ఆటో ఇండియా వృద్ధి అనూహ్యంగా ఉందని, మరింతగా సేల్స్ పెరగనున్నాయని అన్నారు.
- Advertisement -