Monday, December 23, 2024

చెట్టుకు వేలాడుతూ కనిపించిన మహిళ పుర్రె

- Advertisement -
- Advertisement -

Skull hang tree in chittoor
అమరావతి: అటవీ ప్రాంతంలో మహిళ పుర్రె చెట్టుకు వెలాడుతూ కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం డివిఆర్ కండ్రిగ గామ్ర శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కండ్రిగ గ్రామ శివారులో తల మాత్రం చెట్టుకు వేలాడుతూనే కనిపించడంతో మేకల కాపారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం చెట్టుకు వెలాడుతుండడంతో జంతువులు లాక్కెళ్లి ఉంటాయి. చెట్టుకు సమీపంలో ఎముకల గూడు కనిపించింది. పచ్చ, నీలి రంగుతో ఉన్న చీర, డార్క్ గ్రీన్ కలర్ జాకెట్ ఉంది. దీంతో మృతదేహం మహిళదిగా గుర్తించారు. 50 నుంచి 60 రోజుల క్రితం మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య చేసి ఇక్కడ వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఎవరు అనేది తెలిస్తే విచారణ చేయొచ్చని పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో మహిళల అదృశ్యానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. చాలా రోజుల నుంచి అటవీ ప్రాంతంలోకి గ్రామస్థులు వెళ్లకపోవడంతో ఈ విషయం బయటపడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News