Thursday, December 26, 2024

ఆ స్కైవేను నిర్మించలేకపోతున్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రాఫిక్‌ను నివారించేందుకు వేగంగా రహదారులు పనులు చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కెటిఆర్ శాసన సభలో మాట్లాడారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మించాలని అనుకున్నామని కానీ మోడీ ప్రభుత్వం సహకరించడంలేదని మండిపడ్డారు. కేంద్రాన్ని మర్యాదగానే అడుగుతున్నామని, అయినా కలిసి రావడంలేదని కెటిఆర్ మండిపడ్డారు. డిఫెన్స్ భూముల కావడంతో తాము ముందడుగు వేయలేకపోతున్నామని కెటిఆర్ తెలియజేశారు. రోడ్లపై ఉన్న మతపరమైన నిర్మాణాలు చట్టం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎస్‌ఆర్‌డిపి కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశామని, మొదటి దశలో మిగిలిన 11 ప్రాజెక్టుల్ని ఈ ఏడాది పూర్తి చేస్తామని, రెండో దశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడతున్నామన్నారు. త్వరలోనే రెండో దశ పనులకు అనుమతిలిచ్చి ముందుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించందన్నారు. ఇప్పటివరకు 47 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగామని, ప్రభుత్వ చర్యలతో గనుల రాబడిలో గణనీయమైన పెరుగుదల సాధించమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News