Sunday, January 19, 2025

మరో పెద్ద రాకెట్ విక్రమ్ 1 ప్రయోగానికి స్కైరూట్ సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : దేశం లోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్‌ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించిన స్కైరూట్ ఎయిరోస్పేస్ సంస్థ ఏడాది లోనే మరో పెద్ద రాకెట్ విక్రమ్1తో కక్షలోకి శాటిలైట్లను ప్రవేశ పెట్టడానికి సిద్ధమౌతోంది. భవిష్యత్తులో అంతరిక్ష యాత్రకు అయ్యే వ్యయాన్ని కూడా బాగా తగ్గించాలన్న లక్షంతో ఈ అంతరిక్ష అంకుర పరిశ్రమ ముందుకెళ్తోంది.

మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించ గలిగామని, తమ తదుపరి లక్షం ఇంతకన్నా పెద్ద రాకెట్ విక్రమ్ 1ను ఏడాది లోపే ప్రయోగించి కక్షలో శాటిలైట్లను ప్రవేశ పెట్టాలన్న లక్షంతో ఉన్నామని స్కైరూట్ సహ సంస్థాపకులు పవన్ చంద్ర వెల్లడించారు. ప్రపంచం లోని కొద్దిపాటి సంస్థల్లో ఒకటిగా నిలబడాలన్నదే స్కైరూట్ ఆకాంక్ష. తమ సంస్థ ఈమేరకు 68 మిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని సమీకరించిందని, భారత్ లోని అంతరిక్ష అంకుర పరిశ్రమల్లో ఇది భారీ పెట్టుబడిగా పేర్కొన్నారు.

ఇంత భారీ పెట్టుబడి సమీకరించడానికి నాలుగేళ్లు పట్టిందని, వచ్చే సంవత్సరం నుంచి రెవెన్యూ బాగుంటందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. అయితే ప్రస్తుతం అంతరిక్ష ప్రయాణం చాలా వ్యయంతో కూడుకుని ఉండడం పెద్ద సమస్యని, ఎందుకంటే అంతరిక్షం లోకి వెళ్లడానికి రాకెట్లే ఏకైక మార్గమని, కానీ రాకెట్లను నమ్మలేమని , ఒక్కోసారి అవి పనిచేయవని చెప్పారు. సముద్రంలో అవి కూలిపోతే మరో రాకెట్‌ను తయారు చేసుకోవలసి వస్తుందని, ఇదంతా ఎంతో వ్యయంతో కూడుకున్నదని పవన్ చంద్ర వివరించారు.

బ్లూ ఆరిజిన్‌కు చెందిన అమజాన్ సంస్థాపకులు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర సర్వీస్‌లకు అవకాశం కల్పించడం ప్రారంభించారని అయితే భారత్ నుంచి ఇది వాస్తవం కాడానికి మరో పదేళ్లు పడుతుందని తెలిపారు. స్కైరూట్ ప్రైవేట్ రాకెట్ ఈ నవంబర్ 18న విజయవంతంగా అంతరిక్ష కక్షలో శాటిలైట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News