Friday, November 22, 2024

అంతరిక్ష సాంకేతిక సంస్థ స్కైరూట్ కు రూ.225 కోట్ల నిధుల పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ప్రైవేట్ అంతరిక్షసాంకేతిక సంస్థ స్కైరూట్ సింగపూర్‌కు చెందిన టేమ్‌సెక్ నేతృత్వం లోని ప్రీ సీరీస్ సి అనే పెట్టుబడి సంస్థ నుంచి 27.5 మిలియన్ డాలర్లు( రూ.225 కోట్లు) ఆర్థిక సాయాన్ని పొందగలిగింది. ఈ ఆర్థిక సాయంతో మౌలిక వనరులను , సదుపాయాలను ,సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుని వచ్చే రెండేళ్లలో మరిన్ని శాటిలైట్ ప్రయోగాలను చేపట్టనున్నది. వచ్చే సంవత్సరం సెకండ్ మిషన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమౌతున్న సమయంలో ఈ కొత్త పెట్టుబడి నిధులతో మరిన్ని ప్రయోగాలు చేపట్టడమౌతుందని స్కైరూట్ ఏరోస్పేస్ సిఇఒ, సహ సంస్థాపకులు పవన్‌కుమార్ చందన, భరత్ డాకా వెల్లడించారు.

తమపై నమ్మకంతో ఈ పెట్టుబడిని ప్రపంచ ప్రఖ్యాత సింగపూర్ సంస్థ టేమ్‌సేక్ సమకూర్చిందని, తమ ప్రయాణం మరింత ముందుకు సాగేలా ఆ సంస్థ తమతో కలిసి వస్తోందని పేర్కొన్నారు. ఈనెల మొదట్లో స్కైరూట్ స్వదేశీయంగా విక్రమ్1 రాకెట్‌ను రూపొందించి ప్రయోగించింది. ఈ రాకెట్ వచ్చే సంవత్సరం మొదట్లో దిగువ కక్షలో శాటిలైట్లను ప్రయోగించవచ్చని భావిస్తున్నారు. దక్షిణ హైదరాబాద్ లోని మామిడి పల్లిలో జిఎంఆర్ ఎయిరోస్పేస్ , ఇండస్ట్రియల్ పార్కులో మేక్స్ క్యూ క్యాంపస్ అనే నూతన ప్రధాన కేంద్రాన్ని స్కైరూట్ నెలకొల్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News