గాలే: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు దీటైన జవాబిస్తోంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచింది. బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక వికెట్ నష్టానికి 357 పరుగులు చేసింది. ఓపెనర్లు నిషాన్ మదుష్కా, దిముత్ కరుణరత్నెలు శతకాలతో లంకను ఆదుకున్నారు.
కెప్టెన్సీ ఇన్నింంగ్స్ ఆడిన కరుణరత్నె 15 ఫోర్లతో 115 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 228 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. మరోవైపు నిషాన్ 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 149 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి కుశాల్ మెండిస్ అండగా నిలిచాడు. చెలరేగి ఆడిన మెండిస్ 5 సిక్సర్లు, ఏడు ఫోర్లతో అజేయంగా 83 పరుగులు చేశాడు. మరోవైపు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే లంక మరో 135 పరుగులు చేయాలి.