Thursday, January 23, 2025

న్యూజిలాండ్‌పై శ్రీలంక మహిళల విజయం

- Advertisement -
- Advertisement -

కొలంబో: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య శ్రీలంక మహిళల టీమ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా న్యూజిలాండ్ 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి రెండు టి20ల్లో గెలిచిన కివీస్ ఇంతకు ముందే సిరీస్‌ను దక్కించుకుంది. ఇక మూడో టి20లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఓపెనర్ బేట్స్ (37) సమన్వయంతో బ్యాటింగ్ చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డివైన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో వేగంగా 46 పరుగులు సాధించింది.

మిగతావారు విఫలం కావడంతో కివీస్ ఇన్నింగ్స్ 140 పరుగులకే పరిమితమైంది. ప్రత్యర్థి జట్టులో రణవీరా మూడు, సుగంధిక కుమారి రెండు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 14.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ చామరి ఆటపట్టు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయింది. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆటపట్టు 47 బంతుల్లోనే 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేసింది. మరో ఓపెనర్ హర్షిత ఏడు ఫోర్లతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News