- Advertisement -
నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు గాయపడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో గురువారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో భవనం నిర్మిస్తున్నారు. నాల్గొ అంతస్తు కోసం సెంట్రింగ్ సీట్‌లు అమరస్తుండగా ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో సెట్రింగ్ పనిచేస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని భవన నిర్మాణదారులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
- Advertisement -