Tuesday, November 5, 2024

రామంతాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో..పెచ్చులూడి ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

రామంతాపూర్ ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి ఇన్‌వార్డులో పెచ్చులూడి కిందపడటంతో ఇద్దరు వైద్యవిద్యార్థినులకు గాయాలయ్యాయి. ఓ వైద్య విద్యార్థినికి తీవ్రగాయాలు కాగా, హెడ్‌నర్స్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. శుక్రవారం ఉదయం ఇన్‌వార్డులో ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ఆసుపత్రిలో కలకలం రేపింది. వరసగా కురుస్తున్న వర్షాలతో పురాతన భవనంలో కొనసాగుతున్న ఆసుపత్రిలో పెచ్చులూడి పడటంతో వైద్యవిద్యార్థినీ స్నేహిత తలకు బలమైన గాయం కాగా, హెడ్‌నర్స్ సునీతకు స్వల్పగాయాలయ్యాయి. ఘటన సమయంలో ఎక్కువ మంది లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం పొంచివుందని పలుపర్యాయాలు సిబ్బంది విన్నవించినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి జిల్లా కార్యదర్శి టి.సత్యప్రసాద్ తదితరులు ఆసుపత్రిని సందర్శించి, పెచ్చులూడిన ఇన్‌వార్డును పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆసుపత్రులకు నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి ఇటీవల పదిలక్షల రూపాయల గ్రాంట్ విడుదల అయ్యిందని, మరమ్మతులు, ఇతర సదుపాయాల కోసం విడుదల చేసినా పట్టించుకోవడంలేదని రాష్ట్ర ఏఐవైఎఫ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు దర్మేంద్రలు ఈ సందర్బంగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆసుపత్రి పాతభవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News