మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జెకె సిమెంట్ ఫ్యాక్టరీలో ఓ శ్లాబ్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయని స్థానికి ఎంపీ విష్ణు దత్త శర్మ తెలిపారు. ఆ ఫ్యాక్టరీ అమాన్‌గంజ్ టౌన్ వద్ద ఉంది. అయితే ఎంత మంది చనిపోయింది, ఎంత మంది గాయపడ్డారన్న విషయాన్ని పోలీసులు, జిల్లా అధికారులు ధ్రువీకరించలేదు. ‘ఫ్యాక్టరీ లోపల ఓ యూనిట్‌ని కడుతున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ముగ్గురు చనిపోయారు, 16 మంది గాయపడ్డారు, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
బాధితులకు నియమాల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి, కారుణ్యం దృష్టా వారి బంధువులకు ఉద్యోగం ఇవ్వాలి’ అని రాష్ట్ర బిజెపి చీఫ్ విష్ణు దత్త శర్మ కోరారు. ఈ దుర్ఘటన మధ్యాహ్నం 12.00 గంటలకు జరిగిందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సాయి కృష్ణ ఎస్ తోట తెలిపారు. ఇంకా చాలా మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నారు. రెస్కూ ఆపరేషన్‌లో రాష్ట్ర విపత్తు అత్యవసరం ప్రతిస్పందన దళం(ఎస్‌డిఈఆర్‌ఎఫ్) నిమగ్నమై ఉందని ఆయన తెలిపారు.