Monday, December 23, 2024

20నెలల్లో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పూర్తి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/నల్లగొండ
శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం పనులు వేగవంతం చేయాలని ఉప మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ్ర మంత్రుల బృందం శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం పనులు తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బిసి పూర్తికి నెలవారీగా ని ధులు కేటాయిస్తాం.. నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం త వ్వితే రూ.14 కోట్లు నిధులు అవసరమవుతాయి. 20 నెలల్లో ప్రా జెక్టు పూర్తికి అవకాశం ఉంది అని వెల్లడించారు. నెలకు 400 మీ టర్లు కాదు అంతకన్నా ఎక్కువ తవ్వినా ఎంతమేరకు తవ్వితే అం త మేరకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్ర కటించారు. రెండు సంవత్సరాలు క్యాలెండర్ నిర్ణయించుకుని ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఉమ్మడి నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.

గత పాలకులు, గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ కూడా తవ్వకుండా శ్రీశైలం సొరంగ మార్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా రూ.4వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై భా రం పడిందన్నారు. సీఎల్పీ నేతగా నేను, పిసిసి అధ్యక్షుడిగా ఉత్త మ్, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ .. కోమటిరెడ్డి సొరంగ మార్గం పూర్తికి ఆనాటి ప్రభుత్వంపై తీవ్రవత్తిడి తెచ్చామని , పోరాటం చేసామని గుర్తు చేశారు. గోదావరిపై లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరం కడితే కుంగిపోయిందని, కృష్ణానది పై దృష్టి పెట్టకపోవడంతో పాలమూరు పూర్తి చేయలేదని, నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అటు గోదావరి ఇటు కృష్ణ నుంచి గత పది ఏళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టులను గత పాలకులు పూర్తి చేసి ఉంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని, నీళ్ల కోసమే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. ప్రగతిలో ఉన్న ప్రాజెక్టును వదిలేసి రీడిజన్ల పేరిట గత ప్రభుత్వం లక్షల కోట్లు దోపిడీ చేసిందని ,ఫలితంగా రాష్ట్ర ఖజానా దివాలా తీసి ఏడు లక్షల కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయన్నారు.

ఆ బాధతోనే గత ఏడాది మండుటెండల్లో మార్చి నుంచి జూలై వరకు నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేశానని , పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా అన్ని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించానని తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో అన్నట్టుగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందని, ఆరు నెలలు ,ఏడాది రెండు సంవత్సరాలు, ఐదు సంవత్సరాలలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ ఉన్న ఎస్ ఎల్ బి సి పూర్తి అయితే నాగర్ కర్నూల్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతాయని వివరించారు. నక్కలగండి, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో నెల నెల నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్తు అవసరాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించి విద్యుత్ అధికారులు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.

శరవేగంగా పనులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ ల పూర్తికి ప్రణాళికలు చేశామని, ఇకపై శరవేగంగా పనులు కొనసాగుతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు.సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉచితంగా శ్రీశైలం నుండి వచ్చే గ్రావిటీ నీటిని వదిలిపెట్టి కేసీఆర్ ఎత్తిపోతల పథకాలపై ఎందుకు దృష్టి పెట్టారో తెలియడం లేదన్నారు. రూ.3,500 కోట్లు ఖర్చు పెడితే ఎస్.ఎల్.బి.సి ఏనాడో పూర్తి అయి ఉండేదన్నారు. ఇది పూర్తి అయితే శ్రీశైలం నుండి 30 టి.యం.సి ల నీరు నల్లగొండ జిల్లాకు చేరి ఉండేదని తెలిపారు. ఎస్.ఎల్.బి.సి ని వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లక్ష కోట్లు,పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్లు,సీతారాంసాగర్ ప్రాజెక్ట్ కు 10,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.

పదేళ్లు పాలించిన వారి నిర్వాకం తోటే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని ఆరోపించారు. ఇదే పూర్తి అయితే నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల పై చిలుకు పంటపొలాలు సస్యశ్యామలంగా మారెవన్నారు. సుమారు 700 గ్రామాలకు సురక్షితమైన త్రాగు నీరు అంది ఉండేదని వెల్లడించారు. ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ అద్భుతమైన డిజైన్ అని, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉచితంగా శ్రీశైలం నుండి గ్రావిటీ సై చేపట్టిన ప్రాజెక్టు అని తెలిపారు. గ్రావిటీ మీద నడిచే ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం చేశారో అర్ధం కావడం లేదన్నారు. టన్నెల్ పూర్తికి సరిపడా నిధులు విడుదల చేస్తామన్నారు. ఇకపై శరవేగంగా పనులు పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిఇ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క,రోడ్లుభవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలసి నల్లగొండ-నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మన్నెంవారి పల్లెలో ఎస్. ఎల్.బి.సి టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News