Monday, December 23, 2024

నిద్రమత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిద్రమత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. 15మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1160 బాటిళ్ల కోడైన్ ఫాస్పేట్ సిరప్(116 కిలోలు), 1,52,400 ఆల్ఫాజోలం ట్యాబ్లెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హెచ్ న్యూ డిసిపి చక్రవర్తి గుమ్మి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హర్యానాకు చెందిన పవన్ అగర్వాల్, ఎండి బషీర్ అహ్మద్, సత్యనారాయణ, పోచం వేణు, డీలర్లుగా పనిచేస్తున్నారు.

అల్ఫాజోలం ట్యాబ్లెట్స్‌ను విక్రయిస్తున్న వెంకటసురేష్, పురానా చందర్, మల్లేష్ అలియాస్ మహేష్, శ్రీనివాస్ రెడ్డి, కొండా వేణుగోపాల్, శ్రీధర్, పవన్‌కుమార్, ఎండి అబ్దుల్ హఫీజ్, ఎండి అబ్దుల్ సామి, జహీరుద్దిన్ అహ్మద్, నీరజ్ సింగ్‌ను అరెస్టు చేయగా, మరో పదిమంది నిందితులు పరారీలో ఉన్నారు.అల్ఫాజోలం ట్యాబ్లెట్లు నిందితులు పాతబస్తి, కార్వాన్, కుల్సుంపుర, నాంపల్లి, మెహిదిపట్నం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడు అద్దంకి వెంకట సురేష్ బయో ల్యాబ్ రెమిడీస్ రాజస్థాన్ నుంచి ఆల్ఫాజోలం ట్యాబ్లెట్లు కొనుగోలు చేసి అందరికి సప్లయ్ చేస్తున్నాడు.

అందరు మెడికల్ షాపుల నిర్వాహకులు ఎలాంటి ప్రెస్కిప్షన్ లేకుండా, బిల్లు ఇవ్వకుండా వీటిని బాటిల్‌కు రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇన్స్‌స్పెక్టర్ రమేష్ రెడ్డి, ఎస్సై వెంకటరాములు, ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఇన్స్‌స్పెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News