Tuesday, April 1, 2025

ఐపిఎల్ షెడ్యూల్‌లో మార్పు.. కారణం ఇదే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈసారి ట్రోఫీని ముద్దాడేందుకు అన్ని జట్టు సాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే ఈసారి ఐపిఎల్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. అందుకు శ్రీరామనవిమి ఉత్సవాలే కారణం. ఏప్రిల్ 6వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్‌జయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే అదే రోజు శ్రీరామనమ పండగ కూడా ఉంది. కోల్‌కతాలో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. దీంతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేయడం కష్టమవుతుందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బిసిసిఐని కోరింది. దీంతో బిసిసఐ కెకెఆర్ వర్సెస్ ఎల్‌ఎస్‌జి మ్యాచ్‌ను 8వ తేదీకి వాయిదా వేసింది. ఆదే రోజు హైదరాబాద్‌లో జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ యథాతధంగా జరుగుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News