- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 18 రోజుల విరామం అనంతరం లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమైందని చమురు కంపెనీలు తెలిపాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.55, డీజిల్ ధర రూ. 80.91కు చేరుకుంది. చమురు ధరల పెంపు దేశమంతటా అమలులో ఉంటుంది. అయితే వివిధ రాష్ట్రాలలో వ్యాట్, స్థానిక పన్నుల కారణంగా ధరలలో వ్యత్యాసం ఉంటుంది.
- Advertisement -