Monday, December 23, 2024

సిఎం ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పుల దాడి.. మహిళా జర్నలిస్టుపై కేసు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి విజయన తన క్యాబినెట్ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న బస్సుపై ఇటీవల చెప్పుల దాడి జరిగింది. నవకేరళ సదస్సులో పాల్గొనడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి బస్సు కెఎస్‌యు కార్యకర్తలు షూ విసిరారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో మళయాళం ఛానెల్ 24కు చెందిన మహిళా జర్నలిస్ట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయన్‌ను జర్నలిస్టులు ప్రశ్నించారు. రిపోర్టర్ వినీతను ఎందుకు అరెస్ట్ చేశారని అడగ్గా, సాక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ జర్నలిస్టును అదుపులోకి తీసుకున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. గొంతుక ఉంది అని ఎదుటివారిని భయపెట్టాలన్న ఆలోచన సరికాదని సీఎం తెలిపారు. ఆ మహిళా జర్నలిస్టును పోలీసులు విచారిస్తారని సిఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News