Sunday, December 22, 2024

తమిళ సూపర్ స్టార్ పై చెప్పు విసిరిన ఆగంతకుడు (వీడియో)

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో కన్నుమూసిన తమిళ నటుడు విజయ్ కాంత్ అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా పలువురు ప్రముఖులు, సినీరంగానికి చెందిన నటీనటులు హాజరై, విజయ్ కాంత్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే ఇందులో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. విజయ్ కాంత్ భౌతిక దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన అగ్ర నటుడు విజయ్ పై ఎవరో దుండగుడు చెప్పు విసిరాడు. విజయ్ వస్తున్నాడని తెలియడంతోనే వందలాదిమంది అభిమానులు ఒక్కసారిగా ముందుకొచ్చారు.

దీంతో విజయ్ కారు దిగి, విజయ్ కాంత్ భౌతికదేహాన్ని ఉంచిన డిఎండికె పార్టీ కార్యాలయంలోకి వెళ్లడం చాలా కష్టమైంది. నివాళులు అర్పించి, తిరిగి కారు వద్దకు విజయ్ వెళ్తుండగా, ఎవరో వెనుకనుంచి చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు విజయ్ పై పడలేదు. మధ్యలోనే దానిని ఒక కార్యకర్త పట్టుకుని, చెప్పు వచ్చిన దిశగా విసిరేశారు. ఈ సంఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ పై చెప్పు విసిరిన వ్యక్తి ఎవరోగాని వాణ్ని క్షమించకూడదని ఒక అభిమాని ట్వీట్ చేయగా, ఇది సరైన సమయం కాదనీ, అభిమానులు సంయమనం పాటించాలని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News