- Advertisement -
అమరావతి: రోజుల తరబడి వేచిచూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఎపి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని సచివాలయం నుండి ప్రారంభం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. మంచి ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నామని అన్నారు. 26 జిల్లా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని తెలియ జేశారు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకొస్తున్నామని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- Advertisement -