మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు సులువుగా న్యాయమైన, వేగవంతమైన సేవలు అందించడ మే లక్ష్యంగా సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వ చ్చిందని, ఇక్కడ వచ్చే ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. రెవెన్యూ విభాగంలో ఏ సంస్కరణ చేపట్టినా, ఏవిధానపరమైన నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలోనే ఉండాలని అధికారులకు ఆయన సూ చించారు. తొలిరోజు స్లాట్ బుకిం గ్ అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్లాట్ బుకింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తొలిరోజు గురువారం నాడు 626 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా
రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్లలో నిల్చోనే పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు, పారదర్శకతను తీసుకురావడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలో క్యూలైన్లకు గుడ్‌బై చెప్పే రోజులు వస్తాయని, దళారులు ప్రమేయం కూడా ఉండబోదన్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ పూర్తి అవుతుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏరోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ ఉపయోగపడుతుందని అలాగే సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్రజలు మెరుగైన సేవలు అందుతా యని ఆయన అన్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా అపాయిమెంట్ తేదీ, సమయాన్ని కూడా ముందే తెలుసుకోవచ్చన్నారు. నిర్దేశిత తేదీ, సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకోవచ్చన్నారు. స్లాట్ బుకింగ్ వల్ల కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షులు తగిన సమయంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకోవడానికి వీలు కలుగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. పారదర్శకతతో మధ్యవర్తుల ప్రభావానికి తెరపడనుందని మంత్రి పేర్కొన్నారు. –
స్లాట్ బుకింగ్ విధానం అద్భుతంగా ఉంది
గట్టు శ్రీనివాస్, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తి
స్లాట్ బుకింగ్ విధానం అద్భుతంగా ఉందని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన గట్టు శ్రీనివాస్ (మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ఆస్తి కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్నానని ఆయన తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా క్రయ, విక్రయదారులకు చాలా సౌకర్యంగా ఉందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని నిర్ణీత సమయానికి వెళ్లాలని, మొదటిరోజే కేవలం 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలిపారు. తామే రిజిస్ట్రేషన్ మాడ్యూల్లో డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేశామని అన్నీ ఆన్‌లైన్‌లో జరిగినందున ఎక్కడా ఇబ్బంది పడలేదని, తమకు సమయం ఆదా అయిందని, ఎక్కడా అసౌకర్యం లేదని, రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది చాలా సేవాభావంతో సహకరించారని ఆయన తెలిపారు. ఈ కొత్త స్లాట్ బుకింగ్ విధానం చాలా బాగుందని, అధికారులపై ఒత్తిడి కనిపించలేదని, ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా సులభంగా సాగిందని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. –
కొత్త విధానం బాగుంది
ఘన శ్యామ్ పటేల్, (శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్)
కొత్త విధానం బాగుందని ఘన శ్యామ్ పటేల్, (శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్)కు వచ్చిన వ్యక్తి కితాబునిచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తొలిరోజున కొంత సమయం తీసుకున్నా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగిందని ఆయన తెలిపారు. గురువారం తన ఫ్లాట్‌ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించానని, మొత్తం ప్రక్రియ చాలా వెసులుబాటుగా, సమయం ఆదా చేసేవిధంగా ఉందని ఆయన ప్రశంసించారు. తనను నిర్ధిష్ట సమయానికి పిలిచినప్పటికీ కొన్ని డాక్యుమెంట్ల సమర్పణ సక్రమంగా లేకపోవడంతో సుమారు గంటకుపైగా ఆలస్యం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో రిజిస్ట్రార్ కార్యాలయం తరపున ఎటువంటి జాప్యం లేదన్నారు. క్రయ, విక్రయదారులు పూర్తి అవగాహన పెంచుకుంటే కేవలం అరగంటలోగానే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యాలయంలో ఎటువంటి అవినీతి, రద్దీ లేకుండా సాగిన ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగించాలని ఆయన సూచించారు. దీనివలన ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా కార్యాలయ సిబ్బంది నుంచి సహకారం, మార్గదర్శకత్వం లభించాయని ఆయన తెలిపారు. అందువలన తాము ఎక్కడా ఇబ్బంది పడలేదని ఘనశ్యామ్ పటేల్ చెప్పారు.
అప్పుడు 3 గంటలు ఇప్పుడు అరగంట లోపే రిజిస్ట్రేషన్
సి.స్వాతి, (వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు) వచ్చిన మహిళ
గతంలో 3 గంటలు పడితే ఇప్పుడు అరగంట లోపే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని సి.స్వాతి (వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు)కు వచ్చిన మహిళ పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ విధానంలో మార్టిగేజ్ ( తనఖా) రిజిస్ట్రేషన్ చాలా సులువుగా సాగిందన్నారు. ఆస్తి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకొని వల్లభ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చామని 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకొని బయటకు వచ్చామని ఆమె తెలిపారు. మూడు నెలల క్రితం ఇదే ఆఫీసులో రిజిస్ట్రేషన్‌కు వస్తే సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టిందని ఆమె తెలిపారు. ఈ స్లాట్ బుకింగ్ తో సమయం ఆదా అవుతుందని అనుకున్న సమయానికి పనిపూర్తి అయ్యిందని ఆమె పేర్కొన్నారు.