Friday, December 20, 2024

కొత్త పాయింట్, కొత్త కథ

- Advertisement -
- Advertisement -

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి కామికల్ ఎంటర్‌టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ (జూలై 21) పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు.

ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. డాగ్‌కు మెయిల్ వాయిస్ పెట్టాం. కానీ అందులోనూ ఓ ట్విస్ట్ ఉంటుంది”అని అన్నారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కొత్త పాయింట్, కొత్త కథ ఇది”అని చెప్పారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ “ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, నిహార్ దేవెళ్ల, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: నిర్మాతలకు కిచ్చా సుదీప్ లీగల్ నోటీసులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News