Thursday, January 23, 2025

ఆకట్టుకుంటున్న ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. సంజయ్ ‘ఓ పిట్టకథ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసందే. నూతన దర్శకుడు ఏఆర్ శ్రీధర్ రూపొందిస్తున్న ‘స్లమ్ డాగ్ హస్బెండ్’లో సంజయ్ రావు సరసన ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News