Sunday, December 22, 2024

చిన్న పిల్లలకు, మహిళలు మంచి వైద్యం అందించాలి : శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: అనతికాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత సేవలను అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సేవలు హర్షించతగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాదాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమీషన్, మాజీ న్యాయమూర్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోరు ్టరామలింగేశ్వరరావు, కమీషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్, అనురాగ్ శర్మ, జస్జనార్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్, మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇండియా అనిల్ కృష్ణలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి వల్ల అనేక అనారోగ్య సమస్యలని పుట్టబోయే శిశువులు, పట్టిన శిశువులు, చిన్నపిల్లలు, పెద్దవారు ఎదురుకుంటున్నారు. ఈ యొక్క హస్పిటల్ని స్త్రీలకి, చిన్న పిల్లలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్మించడం చాల సంతోష తగ్గ విషయం అన్నారు. రామలింగేశ్వరరావు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్ కమీషన్, మాజీ న్యాయమూర్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాట్లాడుతూ ఉమెన్, చైల్డ్ కోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. మెడికవర్ హస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతు 100 బెడ్స్‌తో, 25బెడ్డడ్ లెవెల్ యూనిట్స్, అత్యాధునిక హై ఎండ్ పరికరాలు, ఆపరేషన్ థియేటర్స్ 24/7 అనుభవజ్ఙులైన గైనకాలజీ, ఒబెస్టిక్స్, పిడియాట్రి క్స్, నియోనాటాలజి డాక్టర్స్ అందుబాటులో శిశువులకి, గర్భిణులకు, పిల్లలకి, స్త్రీలకు వైద్య సేవలని అందించాలి అనే లక్షంతో ఈ యొక్క హస్పిటల్‌ని నిర్మించడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారి అయిన ఆరోగ్య పరీక్షలు చేపించుకోవాలన్నారు. ఎటువంటి రోగాన్ని అయిన మొ దటి దశలొనే గుర్తిస్తే దానికి సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణనష్టం జరుగుతుందన్నారు. డాక్టర్ రవీందర్‌రెడ్డి, పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగం అధిపతి మాట్లాడుతు ప్రతి ఒక్కరికి అత్యాధునిక సౌకర్యాలతో హైఎండ్ టెక్నాలజీతో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్‌రెడ్డి, డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్, సీనియర్ ఇంటర్వెస్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, మహేష్ దేగ్లూర్కర్ ఛీప్ జిబినెస్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, పరిగె హెచ్‌ఒడి నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ డాక్టర్ లలిత, యురోగైనకాలజీస్ట్, గైనకాలజీస్ట్, ఒబెస్టిక్స్ డాక్టర్ రాధికా, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అనూషరెడ్డి, క్లస్టర్ హెడ్ దుర్గేష్, సెంటర్ హెడ్ అనిల్, డిఎంఎస్ డాక్టర్ సంగీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News