- Advertisement -
న్యూఢిల్లీ: ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలతో సుప్రీం కోర్టుపై మరింత భారం పడుతోందని, రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా కోర్టు తలుపు తడుతున్నాయని అన్నిసమస్యలు కోర్టు దృష్టికి వస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎందుకని.. లోక్‌సభ, రాజ్యసభ అర్తమేంటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. అక్రమ వలస దారులందరినీ ఏడాదిలోగా గుర్తించి, నిర్బంధించి, బహిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థనతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌కి సీజేఐ ఈ ప్రశ్న వేశారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా అప్పట్లో ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా 2017 సెప్టెంబర్‌లో ఇద్దరు రోహింగ్యాలు సు ప్రీంను ఆశ్రయించారు. ఆ తరువాత ఈ అంశంపై వరుస పిటిషన్లు సుప్రీం తలుపు తడుతూనే ఉన్నాయి.
Small Issues also comes to Court says SC
- Advertisement -