- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్‌వి జంతు ప్రదర్శనశాలలో పులి పిల్ల మృతి చెందింది. రెండు నెలల క్రితం తిరుపతి ఎస్‌వి జూకు నాలుగు పులి పిల్లలు చేరుకున్నాయి. నల్లమల అడవిలో తల్లికి దూరమై ఎస్‌వి జూకు పులి పిల్లలు చేరాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం గుమ్మడాపురం నుంచి నాలుగు పులి పిల్లలు తీసుకొచ్చారు. పులి పిల్లల ఆలనా పాలన జూ సిబ్బంది చూస్తున్నారు. నాలుగింటిలో ఒక పులి పిల్ల ఈ నెల 29న మృతి చెందినట్లు గుర్తించారు. కిడ్నీ, లివర్ సమస్యతో మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మిగిలిన మూడు పులి పిల్లల రక్తనమూనాలను అధికారులు సేకరించారు. హైదరాబాద్ ల్యాబ్‌కు రక్తనమూనాలను జూ అధికారులు పంపారు.
Also Read: రిటైర్మెంట్‌పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు..
- Advertisement -