Wednesday, January 22, 2025

రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయిన గ్రామవాసులు

- Advertisement -
- Advertisement -

బెల్జియం: ఒల్మెన్ గ్రామం బెల్జియంలోని బాలెన్ మున్సిపాలిటీలో భాగంగా ఉంటోంది. ఆ గ్రామ జనాభా సుమారు 4000. అనూహ్యంగా ఆ గ్రామ ప్రజలను అదృష్టం వరించింది. ఒల్మెన్ గ్రామానికి చెందిన 165 మంది తలా కొంత మొత్తం వేసుకుని యూరో మిలియన్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. మంగళవారం తీసిన లాటరీలో వారి టిక్కెటుకు రూ. 1200 కోట్ల (123 మిలియన్ పౌండ్) కన్నా ఎక్కువ విలువ ప్రైజ్ దక్కింది. దీంతో ఒక్కొక్కరి అకౌంట్లో దాదాపు రూ. 7.50 కోట్లు జమా అయ్యాయి. గత కొన్నేళ్లుగా వారు లాటరీ టిక్కెట్లు కొంటున్నారు. ఈసారి వారిని అదృష్టం వరించింది. ఈ ఏడాది ‘ది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్’ అని వారు సంతోషంలో తేలియాడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News