Monday, December 23, 2024

చిన్ననీటి వనరులు కళకళ

- Advertisement -
- Advertisement -

18,490 చెరువులు పుల్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిన్ననీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే 18,490 చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయి వీటిలో మత్తడి దుముకుతున్నాయి . వీటిలో 5,758చెరువులు 75నుంచి 100శాతం నిండిపోయాయి. మరో 3192 చెరువులు50శాతం నుంచి 75శాతం వరకూ నీటితో నిండిపోయాయి. రాష్ట్రలో చిన్ననీటి వనరుల విభాగం కింద 34,618 చెరువులు ఉన్నాయి .

వీటిలో ఈ వర్షాకాలానికి సంబంధించి ఇప్పటివరకూ 18,490 చెరువులు వరద నీటితో పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఈ చెరువుల్లో వరదనీరు మత్తడి పారుతున్నాయి. అందులో అత్యధికంగా గజ్వేల్ సర్కిల్ పరిధిలో 2,790 చెరువులు ఉన్నాయి. కొత్తగూడెం సర్కిల్ పరిధిలో 1,755, కామారెడ్డి సర్కిల్ పరిధిలో 1,028, ములుగు పరిధిలో 1,553, అదిలాబాద్ పరిధిలో 425, రామగుండం సర్కిల్ పరిధిలో 995, సూర్యాపేట సర్కిల్ పరిధిలో 592 చెరువులు ఉన్నాయి. రాష్ట్రంలో 5758 చెరువుల్లోకి 75నుంచి 100శాతం మేరకు వరదనీరు చేరింది. మరో3,192 చెరువుల్లోకి 50నుంచి 75శాతం నీరు చేరుకుంది. 3,487చెరువుల్లోకి 25నుంచి 50శాతం నీరు చేరింది. 3,691చెరువుల్లోకి 25శాతం మేరకు నీరు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News