Monday, December 23, 2024

విరక్తి, నిరాశ చెందలేదు: సమంత రూత్ ప్రభు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన వైవాహిక సంబంధాలు చెడిపోయినప్పటికీ విరక్తి, నిరాశ చెందలేదని నటి సమంత అన్నారు. తాను ఇంకా ప్రేమిస్తున్నానని, ప్రేమను పంచడానికి ఇంకా చాలా మిగిలే ఉందని ఆమె అన్నారు. సమంత, నాగచైతన్య 2021లో విడిపోయారు. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్‌లో పాలుపంచుకుంటున్నారు. ‘నేను చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ వాటిని హుందాగా ఎదుర్కొన్నాను’ అని తెలిపారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నది.

ఇటీవల తాను మైయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడు, తన స్నేహితుల ప్రేమ తనను ఎనిమిది నెలలు కాపాడిందన్నారు. ‘నేను ఎంతో ప్రేమను పంచాల్సి ఉంది. నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ఒక్క సంబంధం చెడిపోయినందున కుంగుబాటుకు గురికాలేదు’ అన్నారు. నాగచైతన్య, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోయామన్నారు. తమ మధ్య ఓ దశాబ్ద కాలపు స్నేహం ఉందన్నారు. తమ మధ్య ఉన్నది ఓ ప్రత్యేక అనుబంధం అన్నారు. అభిమానులు, క్షేమాన్ని కోరుకునేవారు, మీడియా ఈ గడ్డు రోజుల్లో తమకు మద్దతునివ్వాలని కోరారు. తమ ప్రైవసీని కాపాడుకుంటూ ముందుకు సాగడానికి తోడ్పడాలన్నారు. ‘మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News