Thursday, January 23, 2025

దీర్ఘకాలిక గాయాలు నయం చేసే ‘స్మార్ట్ బ్యాండేజి’

- Advertisement -
- Advertisement -

దీర్ఘకాలిక గాయాలను గమనించి సత్వరం నయం చేయగల స్మార్ట్ బ్యాండేజీని శాస్త్రవేత్తలు రూపొందించారు. డయాబెటిక్ అల్సర్లు (మధుమేహం వల్ల వచ్చే వ్రణాలు ), కాలిన గాయాలకు, శస్త్ర చికిత్సల వల్ల వచ్చే గాయాలకు ఈ సాధనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 2018 అధ్యయనం ప్రకారం బ్రిటన్‌లో ఏటా దీర్ఘకాల గాయాలతో బాధపడేవారు దాదాపు 2.2 బిలియన్ మంది వరకు ఉంటున్నారు.

ఇప్పుడు ఈ సాధనం సాగదీయగల, వైర్లులేని, బయోఎలెక్ట్రానిక్ సిస్టమ్‌తో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాధనంలో రెండు భాగాలున్నాయి. ఒకటి తిరిగి ఉపయోగించుకోడానికి వీలుపడే అనువైన, ప్రింటెడ్ సర్కూట్ బోర్డు, మరొకటి తిరిగి ఉపయోగించలేని (డిస్పోజబుల్) ప్యాచ్ గా కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన పరిశోధకులు డాక్టర్ వెల్ గావో వెల్లడించారు. ఈ డిస్పోజబుల్ ప్యాచ్ కు బయోసెన్సార్లు, ఎలెక్ట్రోడ్లు, డ్రగ్ నింపిన హైడ్రోజల్స్ ఉంటాయి.

ఈ బయోసెన్సార్లు అంటే స్మార్ట్ బ్యాండేజి యే. ఇవి గాయాన్ని పరిశీలిస్తాయి. గాయం ఉష్ణోగ్రత, లోతు, గ్లూకోజ్, యూరిక్ యాసిడ్, లాక్టేట్, తదితర పదార్ధం స్థాయిలు , లక్షణాలను పరిశీలిస్తాయి. గాయం ఇన్‌ఫెక్షన్ అయిందా, బాధ ఇవన్నీ గమనిస్తాయి. ఈ సాధనానికి విద్యుత్ ప్రేరణ ( electrical stimulation ) కలిగిస్తారు. గాయాలు మాన్పడానికి ఇది వరకు ఈ ప్రక్రియను కనుగొన్నప్పటికీ, దానికి చాలా ఎక్కువలో స్థూలమైన పరికరాలు అవసరం అయ్యేవి. అదీకాక యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ అంటే బాధను నివారించే, బ్యాక్టీరియాను నిరోధించే వాటిని విడుదల కానీయకుండా నియంత్రించేది.

ఇప్పుడీ సాధనం వల్ల అన్ని సంకేతాలు వైర్‌లెస్ ద్వారా ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌కు పంపబడతాయి. డ్రగ్ విడుదలను కూడా వైర్‌లెస్ ద్వారా నియంత్రిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ సాధనాన్ని మొదట డయాబెటిస్ ఇన్‌ఫెక్షన్ గాయాలున్న ఎలుకలపై ప్రయోగించి చూశారు. ఈ సాధనం గాయం లక్షణాలను, ఉష్ణోగ్రత, గ్లూకోజ్ స్థాయిలు, గాయం ద్రవం స్థాయిని సరిగ్గా గుర్తించి ఫలితం ఇవ్వగలిగిందని పరిశోధకులు వివరించారు. గాయాలు వేగంగా మానినట్టు గుర్తించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News