Wednesday, January 22, 2025

రవాణశాఖలో అటకెక్కుతున్న చిప్‌తో కూడిన స్మార్టు కార్డులు

- Advertisement -
- Advertisement -

చిప్ లేకుండా కార్డులు జారీ చేస్తున్న అధికారులు

మన తెలంగాణ,సిటీబ్యూరో: నిధుల కొరత కారణంగా రవాణశాఖ చిప్‌తో కూడా స్మార్టు కార్డులు ( డ్రైవింగ్ లెసెన్స్‌లు, ఆర్సీలు) అందించడంలో విఫలం అవుతోంది. 2010లో రవాణశాఖ అధికారులు త్రీ టైర్ విధానం ద్వారా వీటిని అమల్లోకి తీసుకు వచ్చింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సాధారణ స్మార్టు కార్డుల స్థానంలో చిప్‌తో కూడిన స్మార్టు కార్డులను అందచేస్తున్నారు. ముఖ్యంగా నకిలీలకు చెక్ పెట్టే విధంగా ఆర్సీల్లో, లైసెన్స్‌లు, హలో గ్రామ్ వంటివి ప్రింట్ చేస్తూ వినియోగదారులకు అందచేసింది.

వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారి వివరాలన్నీ చిప్‌కార్డుల్లో నిక్షిప్తంగా అవుతాయి. దీని ద్వారా సదరు వాహనం లేదా వ్యక్తి ఏదైనా నప్రమాదానికి గురయితే కార్డు ఆధారంగా వివరాలు క్షణాల్లో తెలుస్తాయి.అంతే కాకుండా కార్డుల మీద పేర్లును మార్చినంత సులభంగా చిప్‌లు మార్చడానికి సాధ్యపడదు తద్వారా విద్రోహశక్తుల చేతుల్లో ఇవి పడ్దా సంబంధిత వ్యక్తుల వివరాలు వెంటనే తెలుస్తాయి.ఇంతటి ప్రాధాన్యత కలిగిన చిప్‌లతో కూడిన రవణాశాఖ స్మార్లు కార్డులు క్రమంగా కనుమరుగు అవుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్మార్టు కార్డులను సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు గత రెండు సంవత్సరాలుగా రవాణశాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిధులు చెల్లించక పోవడంతోకొన్ని నెలలుగావారు కార్డులు పంపిణీ నిలిపివేశారు. గతంలో కూడా నాలుగైదు సార్లు ఇదే విధంగా జరగడంతో కార్డుల పంపిణీ ఆగిపోయింది. దీంతో ఇవ్వాల్సిన మొత్తంలో 30 శాతం వరకు చెల్లించడంతో కార్డులను పంపిణీ చేశారు. తాజాగా కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.3 కోట్లకు పైగా చేరడంతో కార్డులు పంపిణీ నిలిపివేశారు. అధికారులు కొంత మొత్తం విడుదల చేయడంతో ప్రస్తుతం వన్ నేషన్ వన్ కార్డుల భాగంగా క్యూర్ కోడ్‌తో చిప్ లేకుండా నూతన కార్డులను ముద్రణ చేసి అందిస్తోంది.కార్డులు జారీలో జాప్యం నివారించేందుకు తాము చిప్‌లేకుండా కార్డులను అందిస్తున్నామని, అధికారులు చెబుతున్నారు. త్వరలో పరిస్థితి సర్దుకుంటుందని గతంలో మాదిరిగా చిప్‌లతో కూడిన స్మార్టు కార్డులను అందచేస్తామని అధికారులు చెబుతున్నారు.

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News