Wednesday, January 8, 2025

జెఇఇ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్… ఇంటర్ టాపర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జెఇఇ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా నలుగురు విద్యార్థులు కాపీ కొట్టారు. ఆదివారం జరిగిన స్మార్ట్ కాపీయింగ్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కడప జిల్లాకు చెందిన ఎస్‌ఎస్‌సి, ఇంటర్ టాపర్ కీలక సూత్రదారిగా ఉన్నాడు. తన మిత్రుల కోసం కడప విద్యార్థి స్మార్ట్ కాపీయింగ్ చేశాడు. సికింద్రాబాద్‌లోని ఎస్‌విఐఇ సెంటర్‌లో కాపీయింగ్ జరిగింది. తాను రాసిన జవాబు పేపర్ వాట్సాప్ ద్వారా మిత్రులకు విద్యార్థి షేర్ చేశాడు. వివిధ సెంటర్లలో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా జవాబు పత్రాన్ని తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో కడప విద్యార్థిని , స్నేహితులను అబ్జర్వర్ పట్టుకున్నాడు. ఎస్‌విఐఇ సెంటర్ నుంచి జవాబు పేపర్ వచ్చినట్టు గుర్తించారు. కడప జిల్లా టాపర్‌ని అబ్జర్వర్ పోలీసులకు అప్పగించాడు.

Also Read: కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News