Thursday, December 19, 2024

కాళేశ్వరంపై విచారణ.. తెలియదు, గుర్తు లేదన్న సోమేశ్ కుమార్, స్మితా సబర్వాల్‌..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. గురువారం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు విచారణకు ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణ అనుమతులపై ప్రశ్నించారు. క్యాబినెట్ అనుమతి లేకుండానే జీవోలు వచ్చాయా? అని కమిషన్‌ ప్రశ్నించింది. కమిషన్‌ ప్రశ్నలకు తెలియదని స్మితాసబర్వాల్‌ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణంలో తన రోల్ లిమిటెడ్ అని, ప్రాజెక్టులపై తనకు అవగాహన లేదని ఆమె చెప్పినట్లు సమాచారం.

ఇక, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కుడా ఇలాగే సమాధానం చెప్పడంతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కొద్దికాలమే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నానని.. సీఎస్ గా ఉన్నపుడు కెబినేట్ నిర్ణయాల మేరకు ముందుకెళ్లానని సోమేశ్ కమిషన్ కు తెలిపారు. కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు.. తెలియదు, గుర్తుకు లేదు.. చాలా ఏళ్లైందని సోమేశ్ కుమార్ సమాధానం చెప్పినట్లు సమాచారం. దీంతో అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని కమిషన్ సీరియస్ అయ్యింది. ఏ నిర్ణయమైనా కెబినేట్ నిర్ణయం మేరకు ముందుకెళ్లాననడంపై చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News