* సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్
* మొక్కను నాటిన రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి
హైదరాబాద్ : ప్రజలందరూ హరితోద్యమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. 8వ విడత హరితహారం, ఐదో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జనగామ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు స్మిత సభర్వాల్, ప్రియాంక వర్గీస్ మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. హరిత స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి.. 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.
మార్పులో భాగస్వాములు కావాలి : సతీష్‌రెడ్డి, రెడ్కో చైర్మన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటి రెడ్కో చైర్మన్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని వై.సతీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రెడ్కో కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్కో చైర్మన్‌గా మొక్కను నాటడం ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. మంచి భవిష్యత్తు కోసం మార్పులో ప్రజలందరూ భాగస్వాములం కావాలని కోరారు.