Wednesday, January 22, 2025

సిఎం కార్యదర్శి స్మితకు ఇరిగేషన్ బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శిగా ఉన్న రజత్ కుమార్‌కు ఈ నెల 30తో అఖిలభారత ఐఏఎస్ అధికారిగా సర్వీసు ముగియ నుంది. దీంతో రజత్ కుమార్ గురువారం నీటిపారుదల శాఖ అధికారిగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ స్థానంలో నీటిపారుదల శాఖ అదనపు పూర్తి బాధ్యతలను స్మిత సబర్వాల్‌కు అప్పగిస్తూ తెలగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు పునరావాసం , భూసేకరణ విభాగం డైరెక్టర్ భాద్యతలను కూడా స్మితకు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News