ఇటీవల స్మిత సబర్వాల్ తరచూ వివాదాల్లోకి దిగుతున్నారు. ఆమె ప్రభుత్వంతో గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మామూలుగానే సివిల్ సర్వీసులలో అధికారుల భావప్రకటన స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి. 1923 అధికార రహస్యాల చట్టం (అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్) ప్రకారం ఐఎఎస్ అధికారులు ప్రభుత్వ ప్రయోజనాలకు హాని కలిగించే అవకాశం ఉన్న ప్రకటనలు చేయడం నిషిద్ధం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లయితే సర్వీస్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. అటువం టి సందర్భాలలో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై క్రమశిక్షణ చర్యలే కాకుండా వాళ్ళ ర్యాంకును తగ్గించడం లేదా సర్వీసులోంచి తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మినహాయింపులు ఉండొచ్చు. ఒక అధికారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, తప్పుడు పనులను వెలికితీసినట్టయితే విజిల్ బ్లోయర్ చట్టాలకింద అటువంటి అధికారులకు రక్షణ లభించే అవకాశం ఉంటుంది.
ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, ‘ఆయనను హత్య చేసి ఉండేవాడిని’ అన్న వ్యక్తి ఇంటర్వ్యూ ప్రసారం చేసి, అందుకు సంబంధించిన కేసులో అరెస్టయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక మహిళ చేసిన ట్వీట్‌ను స్మిత సబర్వాల్ రిపీట్ చేశారు. ఆ మహిళ తన పోస్ట్‌లో ‘ఫ్రీ స్పీచ్.. తెలంగాణ మోడల్’ అనే శీర్షిక తో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ట్వీట్ చేస్తే, దాన్నే స్మిత రీపోస్ట్ చేశారు. అఖిల భారత సర్వీసుల కాంట్రాక్ట్ రూల్స్ -1968 ప్రకారమైనా, 1923- అధికార రహస్యాల చట్టం కిందనైనా స్మిత సబర్వాల్ ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి ఉండకూడదు.
స్మిత సబర్వాల్ తాజాగా మరో ట్వీట్ చేసారు. గచ్చిబౌలి పోలీ సులకు సహకరించాననీ, చట్టాన్ని గౌరవించే పౌరురా లిగా కర్తవ్యాన్ని నెరవేర్చానని చెపుతూనే తనను ఏ పోస్ట్ విషయంలో అయితే నోటీసు ఇచ్చి పిలిపించారో అదే పోస్ట్ మరో రెండు వేలమంది షేర్ చేశారనీ, వాళ్ళందరి మీద కూడా ఇదే చర్యలు తీసుకుంటున్నారా? అని అడిగానని పేర్కొన్నారు. ‘అలా చెయ్యక పోతే కొద్దిమందిని ఎంచుకుని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది, చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ సమన్యాయం జరగాలన్న సూత్రానికి భంగం వాటిల్లుతుంది’ అని కూడా స్మిత పేర్కొన్నారు. ఆ రెండు వేల మందీ స్మిత సబర్వాల్ లాగా సివిల్ సర్వీస్ అధికారులు కారు కదా.
స్మిత సబర్వాల్ రాజకీయాల్లో చేరతారేమో.. అందు కోసమే ఇలా ప్రభుత్వంపట్ల కవ్వింపు చర్యలకు దిగు తున్నారేమో అనే చర్చ కూడా ఉన్నది. అందులో తప్పేం లేదు. భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది. గతంలో రాజ కీయాల్లో చేరిన ఐఎఎస్ లు, ఐపిఎస్‌లు చాలా మంది ఉన్నారు. సొంతంగా పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎఎస్ ఎవిఎస్ రెడ్డి మొదలుకొని ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ వరకూ పలువురు సివిల్ సర్వీస్ అధి కారులు రాజకీయాలలో తమ భవిష్యత్తును తేల్చుకు నేందుకు అర్ధంతరంగా రాజీనామా చేసి వెళ్లినవాళ్లే. అటువంటి ఆలోచన ఏదైనా స్మిత సబర్వాల్‌కు ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.
కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రయత్నం వివాదాస్పదమై సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు రెండు వేల ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందినదా, రాష్ట్ర ప్రభుత్వం సొంతమా అనే విషయం సుప్రీం కోర్టులో తేలాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా విన్న తర్వాత దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏం తీర్పిస్తుందో చూద్దాం. బంతి సుప్రీం కోర్టులో ఉన్నది కాబట్టి ఇప్పుడు దానిగురించి ఎవరూ బయట మాట్లాడటం సమంజసం కాదు. ఈలోగా కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో మళ్లీ ఒకసారి మనం సామాజిక మాధ్యమాలుగా చెప్పుకుంటున్న సోకాల్డ్ సోషల్ మీడియా వేదికల గురించి మాట్లాడుకోవాల్సి వస్తున్నది.
ఎక్స్ (ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వగైరా వగైరా సామాజిక వేదికల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో సమాజానికి అంతే నష్టం జరగడంకూడా మనం చూస్తున్నాం. ఇటీవల కొంతకాలంగా దీనిమీద చర్చ కూడా జరుగుతున్నది. దీనిని మీడియా అనడానికి వీలు లేదనే చర్చ బలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భావప్రకటన స్వేచ్ఛపేరిట ఎవరికి తోచినట్టువారు, ఎలాపడితే అలాంటి భాషవాడుతూ వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా మాట్లాడుతున్నారనే విమర్శ ఉంది.
మామూలుగా ప్రధాన స్రవంతి మీడియాకు ఉన్న స్వీయ నియంత్రణలు గానీ, ఇతర చట్టాలు గానీ ఈ సామాజిక వేదికలకు లేవు. ఇక అసలు విషయానికి వస్తే, సామాన్యులకు ఈ విషయంలో పెద్ద అవగాహన లేకపోవచ్చు. కానీ సివిల్ సర్వీసులలో దేశంలోనే నాలుగవ ర్యాంకు తెచ్చుకొని, ప్రతిభావంతురాలైన అధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక ఐఎఎస్ అధికారి ఈ సామాజిక వేదికలమీద స్పందిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.
ఇక్కడ రెండు రకాలవాళ్లు ఉంటారు. సామాజిక వేదికలమీద స్పృహ తెలియకుండా ఇష్టమైన రీతిలో ఎవరి గురించయినా వ్యాఖ్యానాలు చేసేవాళ్లు, ఇతరులు చేసిన వ్యాఖ్యానాల మీద తమ ‘గోడల’పై ప్రచారం చేసేవాళ్లు మొదటి కోవకు చెందినవాళ్లు. రెండో రకానికి చెందినవాళ్లు.. బాధ్యత గల అధికారులు. వీళ్లకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏదిపడితే అది మాట్లాడకూడదు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు మాట్లాడటానికి, రాయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది స్మిత సబర్వాల్ అనే ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి గురించి. ప్రతిభావంతురాలైన అధికారిగా ఆమెకు చాలా మంచి పేరు ఉన్నది. ఐఎఎస్ అధికారిగా ఆమె చేసిన ప్రజాసేవకు పలు అవార్డులు కూడా లభించాయి.దాదాపు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకమైన పదవి నిర్వహించారు. అయితే ఇటీవల ఆమె తరచూ వివాదాల్లోకి దిగుతున్నారు.
ఆమె ప్రభుత్వంతో గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మామూలుగానే సివిల్ సర్వీసులలో అధికారుల భావప్రకటన స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి. 1923 అధికార రహస్యాల చట్టం (అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్) ప్రకారం ఐఎఎస్ అధికారులు ప్రభుత్వ ప్రయోజనాలకు హాని కలిగించే అవకాశం ఉన్న ప్రకటనలు చేయడం నిషిద్ధం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లయితే సర్వీస్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించినట్టుగా పరిగణిస్తారు. అటువంటి సందర్భాలలో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై క్రమశిక్షణ చర్యలే కాకుండా వాళ్ళ ర్యాంకును తగ్గించడం లేదా సర్వీసులోంచి తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మినహాయింపులు ఉండొచ్చు. ఒక అధికారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, తప్పుడు పనులను వెలికితీసినట్టయితే విజిల్ బ్లోయర్ చట్టాలకింద అటువంటి అధికారులకు రక్షణ లభించే అవకాశం ఉంటుంది.
1968 ఆల్ ఇండియా సర్వీసుల ప్రవర్తన రూల్స్ ప్రకారం సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రభుత్వాన్ని గానీ, ప్రభుత్వ విధానాలను గానీ బహిరంగంగా విమర్శించకూడదు. ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే అవకాశం ఉన్న ప్రకటనలు చేయకూడదు. అది సీనియర్ ఐఎఎస్ అధికారి స్మిత సబర్వాల్ పట్టించుకున్నట్లు లేరనే సంగతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా ఆమె ఈ వేదికల మీద రీపోస్ట్ చేస్తున్న విషయాలవల్ల ఎవరికైనా అర్థం అవుతుంది. ఇంతకుముందే చెప్పినట్టు ఈ సామాజిక వేదికలని తరచూ ఉపయోగించుకునే స్మిత సబర్వాల్ గతంలో ఒకసారి దివ్యాంగులు సివిల్ సర్వీసులకు పనికిరారని తన అభిప్రాయాన్ని వేదికల ద్వారా ప్రచారం చేసి వివాదంలోకి దిగారు. అంతకంటే ముందు కొద్ది సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల వారపత్రిక హైదరాబాద్ ప్రతినిధి రాసిన సరదా కాలమ్‌కు ఆ పత్రిక కార్టూనిస్ట్ వేసిన క్యారికేచర్ మీద మండిపడి పరువు నష్టం దావా వేశారు. ఆ క్రిమినల్ డిఫమేషన్ కేసు ఇప్పటికీ ఇంకా కోర్టులో నలుగుతున్నట్టుంది. ఆ క్యారికేచర్లో ఒక మహిళా అధికారిని అలా చిత్రించడం అభ్యంతరకరమే. దీనికి ఆ జాతీయ వారపత్రిక బహిరంగంగానే తన పత్రిక ద్వారా విచారాన్ని వ్యక్తం చేసింది. 2017 జులై ఆరో తేదీ సంచికలో ఆ ఆంగ్ల వారపత్రిక నో బోరింగ్ బాబు అనే శీర్షికతో ఒక వ్యంగ్య వ్యాఖ్యానాల కాలంలో స్మిత సబర్వాల్ గారి పేరు కూడా లేకుండా ప్రచురించిన వ్యాఖ్యానం, కార్టూన్ రెండింటిపట్ల యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.
అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. కేసు వెనక్కు తీసుకోలేదు. కార్టూనే కదా అని వదిలేయకుండా కొట్లాడుతున్నారు. విచిత్రమేమంటే, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రీపోస్ట్ చేసిన ట్వీట్ లో ‘ఇక ముఖ్యమంత్రి కార్టూన్లపైనా విరుచుకుపడతారేమో’ అనే అర్థం వచ్చేలా ఉంది. మరింత వివరంగా చెప్పాలంటే, అనూష రవిసూద్ అనే మహిళ చేసిన ట్వీట్‌నే స్మిత సబర్వాల్ రీపోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో రవిసూద్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన చిత్రాన్ని రీపోస్ట్ చేసినందుకు కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడంవల్ల ఏంటి ప్రయోజనం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారూ, మీ తదుపరి కార్యక్రమం వ్యంగ్య చిత్రాలు గీసే కార్టూనిస్టుల మీద కేసులు పెట్టడమేనా? అని ప్రశ్నించారు. అదే ట్వీట్‌ను స్మిత రీపోస్ట్ చేశారు. అంటే, తన పేరు కూడా లేని ఒక సరదా కాలమ్‌కు వేసిన చిత్రంపట్ల అభ్యంతరం తెలిపి కోర్టులో కేసు నడుపుతున్న స్మిత సబర్వాల్.. తన కేసులో ఆ కార్టూన్ వేసిన వాళ్లకు శిక్షపడాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి లేదా ఇంకొకళ్ళు ఇతర అభ్యంతరకర కార్టూన్ల మీద ఎటువంటి కేసులు పెట్టకూడదనే అర్థం కదా ఇందులో ఉన్నది?
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల ద్వారా సామాజిక వేదికల మీద జరుగుతున్న ప్రచారంపట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటివాటి మీద పోలీసులు కేసు పెడుతున్నారు. తాము పోస్ట్ చేయడమే కాకుండా ఇతరులు పోస్ట్ చేసిన వాటిని తిరిగి ప్రచారంలోకి తీసుకుపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నది. ఇది అర్థం చేసుకున్న పలువురు పొరపాటున తాము రీపోస్ట్ చేసిన ట్వీట్లను తొలగించడం కూడా మనం గతకొద్ది రోజులుగా చూస్తున్నాం.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర ప్రముఖులు కొందరు ఇలా రీపోస్ట్ చేసిన ట్వీట్లను తొలగించారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారి స్మిత సబర్వాల్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ట్వీట్లు చేయడం, ఇతరులు చేసిన ట్వీట్లను రీపోస్ట్ చేయడం కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, ‘ఆయనను హత్య చేసి ఉండేవాడిని’ అన్న వ్యక్తి ఇంటర్వ్యూ ప్రసారం చేసి, అందుకు సంబంధించిన కేసులో అరెస్టయి, బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక మహిళ చేసిన ట్వీట్‌ను స్మిత సబర్వాల్ రిపీట్ చేశారు. ఆ మహిళ తన పోస్ట్‌లో ‘ఫ్రీ స్పీచ్.. తెలంగాణ మోడల్’ అనే శీర్షికతో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ట్వీట్ చేస్తే, దాన్నే స్మిత రీపోస్ట్ చేశారు. అఖిల భారత సర్వీసుల కాంట్రాక్ట్ రూల్స్ -1968 ప్రకారమైనా, 1923- అధికార రహస్యాల చట్టం కిందనైనా స్మిత సబర్వాల్ ఈ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి ఉండకూడదు.
ఇంత జరిగాక కూడా ఆమె తాజాగా మరో ట్వీట్ చేసారు. గచ్చిబౌలి పోలీసులకు సహకరించాననీ, చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా కర్తవ్యాన్ని నెరవేర్చానని చెపుతూనే తనను ఏ పోస్ట్ విషయంలో అయితే నోటీసు ఇచ్చి పిలిపించారో అదే పోస్ట్ మరో రెండు వేలమంది షేర్ చేశారనీ, వాళ్ళందరి మీద కూడా ఇదే చర్యలు తీసుకుంటున్నారా? అని అడిగానని పేర్కొన్నారు. ‘అలా చెయ్యకపోతే కొద్దిమందిని ఎంచుకుని టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతుంది, చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ సమన్యాయం జరగాలన్న సూత్రానికి భంగం వాటిల్లుతుంది’ అని కూడా స్మిత పేర్కొన్నారు. ఆ రెండు వేల మందీ స్మిత సబర్వాల్ లాగా సివిల్ సర్వీస్ అధికారులు కారు కదా.
ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఉద్దేశం ఏమైనా, బయటకు కనిపిస్తున్నది మాత్రం ఆమె ప్రభుత్వంతో గిచ్చి కయ్యం పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారని. ఇంటా బయటా.. అంటే ప్రభుత్వంలోనూ, వెలుపల ఈ వ్యవహారంపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. స్మిత సబర్వాల్ రాజకీయాల్లో చేరతారేమో.. అందుకోసమే ఇలా ప్రభుత్వంపట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారేమో అనే చర్చ కూడా ఉన్నది. అందులో తప్పేం లేదు. భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది. గతంలో రాజకీయాల్లో చేరిన ఐఎఎస్ లు, ఐపిఎస్‌లు చాలా మంది ఉన్నారు. సొంతంగా పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎఎస్ ఎవిఎస్ రెడ్డి మొదలుకొని ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ వరకూ పలువురు సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాలలో తమ భవిష్యత్తును తేల్చుకునేందుకు అర్ధంతరంగా రాజీనామా చేసి వెళ్లినవాళ్లే. అటువంటి ఆలోచన ఏదైనా స్మిత సబర్వాల్‌కు ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వంలో ఉంటూనే ఇటువంటి పనులు చేస్తే గిచ్చి కయ్యం పెట్టుకోవడమే అంటారు.