Saturday, December 21, 2024

కేంద్ర సర్వీసుల్లోకి స్మిత సబర్వాల్!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లేందుకు సిద్దపడ్డారు. ఈ మేరకు స్మిత దరఖాస్తు కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా , ముఖ్యంత్రి కార్యాలయ కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మిషన్ భగీరధ ప్రాజెక్టు అమలుకు ఇంజార్జిగా వ్యవహరించింది. ఆమెకు అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అప్పటి ప్రభుత్వం నీటిపారుదల శాఖ కార్యదర్శి బాద్యతలు కూడా అప్పగించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటంతో స్మిత ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది .ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యదర్శి స్మిత సబర్వాల్ నేతృత్వంలో జరగాల్సిన ఈ కీలక సమావేశానికి ఆమె హజరుకాలేదు. ఈఎన్సీ అధ్వర్యంలోనే సమీక్ష సమావేశం ముగిసింది. కొత్త ప్రభుత్వంలో ఎక్కడా కనిపించని స్మిత సబర్వాల్ తెలంగాణ రాష్ట్ర నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు ఐఎఎస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.స్మిత ఇటీవల ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. తన 23ఏళ్ల కేరీర్‌ను ప్రస్తావించారు. తాను కొత్త చాలెంజ్‌లకు ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్టు తెలిపారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ స్మిత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News